వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. ఆయన బీసీ రెసిడెన్షియల్ స్కూల్, డిగ్రీ కళాశాల భవన నిర్మాణాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ పనులను పారదర్శకంగా చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

