Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొట్టుపరువులో కరిరాజులు

Follow Udayam Digital on Google
Ravi Singh Jun 08, 2026 6:03 PM నెల్లూరు వైరల్ వార్తలు
కొట్టుపరువులో కరిరాజులు - Udayam Digital
సాలూరు మండలం కొట్టుపరుపు సమీపంలో ఏనుగుల గుంపు తిష్ఠ వేయడంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆదివారం మక్కువ మండల సరిహద్దుల నుండి ఎరగెడవలస మీదుగా ఇక్కడికి చేరుకున్న ఏనుగులు, పరిసర ప్రాంతాల్లోని పామాయిల్‌, చెరకు, అరటి తోటలపై పడి భారీగా పంట నష్టం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పామాయిల్ తోటల్లోని డ్రిప్ పైపులను సైతం ధ్వంసం చేశాయి. ఈ విషయమై అటవీశాఖ రేంజర్ తవిటినాయుడు స్పందిస్తూ ఏనుగుల కదలికలపై నిఘా ఉంచి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే, ఏనుగుల దాడిలో పంటలు నష్టపోయిన బాధిత రైతులకు ప్రభుత్వం తరఫున త్వరలోనే తగిన పరిహారం అందేలా చూస్తామని మంత్రి సంధ్యారాణి ప్రకటించారు.

Comments

G
Loading comments...