వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం ఓటర్ల ముసాయిదా జాబితాలోని లోపాలను వెంటనే సరిచేయాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ డిమాండ్ చేశారు. బుధవారం ఖమ్మం KMCలో ఎన్నికల ఇన్చార్జి రాముకు వినతిపత్రం అందజేశారు.
జాబితాలో పాత ఫొటోలు, మరణించిన వారి పేర్లు, డబుల్ ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఒకే కుటుంబ సభ్యుల ఓట్లు వేర్వేరు బూత్లలో నమోదయ్యాయని పేర్కొన్నారు. మ్యాపింగ్ ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలకు అందించాలని కోరారు.
Comments
Loading comments...

