వార్తలకు తిరిగి వెళ్లండి
సేవల మెరుగుకు కీలక చర్యలు

రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై నిమ్స్ డైరెక్టర్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర విభాగంలో పడకల కొరతను అధిగమించడానికి నిరంతర పర్యవేక్షణ చేపట్టి, రోగులను వెనక్కి పంపే కేసులను 5 శాతానికి తగ్గించారు.
అలాగే, ఎంఆర్‌ఐ, 2డీ ఈకో పరీక్షల నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు కార్యాచరణ మొదలుపెట్టారు. బిల్లింగ్, శాంపిల్ సేకరణలో జాప్యాన్ని నివారించేందుకు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసి, సేవల పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
Comments
Loading comments...