Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లిక్కర్ అమ్మకాలపై కేరళ సర్కార్ ప్రకటన

Follow Udayam on Google
రవళి దేవి Jul 03, 2026 3:15 PM జాతీయంGeneral
లిక్కర్ అమ్మకాలపై కేరళ సర్కార్ ప్రకటన - Udayam
రాష్ట్రంలో తక్కువ ఆల్కహాల్ శాతం ఉండే పానీయాల (లో-ఆల్కహాల్ లిక్కర్) విక్రయాలకు అనుమతించే అంశంపై కేరళ ఎక్సైజ్ శాఖ మంత్రి ఎం. లిజు కీలక ప్రకటన చేశారు. నూతన మద్యపాన విధానాన్ని ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేసిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన ఒక సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. నూతన లిక్కర్ పాలసీ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి లిజు వివరించారు.

Comments

G
Loading comments...