Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసముద్రం మార్కెట్లో మొరాయించిన ఈ-నామ్ సర్వర్

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 2:49 PM మహబూబాబాద్ General
కేసముద్రం మార్కెట్లో మొరాయించిన ఈ-నామ్ సర్వర్ - Udayam
కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఈ-నామ్ సర్వర్ సమస్యతో పోర్టల్ ఓపెన్ కాలేదు. దీంతో వ్యాపారులు లాట్ ఐడీలకు ధరలను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేక వేలం పాటలు నిలిచిపోయాయి. రైతులు యార్డులో పడిగాపులు పడ్డారు. ఈ-నామ్ 2.0లో మొబైల్ ద్వారా ఈ-బిడ్డింగ్ చేసే అవకాశం లేకుండా పోయిందని, పీసీలో మాత్రమే పనిచేస్తోందని వ్యాపారులు తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...