వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో మురుగు, వర్షపు నీరు నిల్వ కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
జీసీడీఓ అస్రా ఫాతిమా ఖాద్రీ, MPDO లక్ష్మణ్ రాథోడ్, కేజీబీవీ ఎస్ఓఏ కవిత, సర్పంచ్, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

