Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డి.యర్రవరంలో కప్పతల్లి ఊరేగింపు

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 11:24 AM అనకాపల్లి General
డి.యర్రవరంలో కప్పతల్లి ఊరేగింపు - Udayam
సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ నాతవరం మండలం డి.యర్రవరంలో గ్రామస్థులు, యువత ఆధ్వర్యంలో కప్పతల్లి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. స్థానిక రామాలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి, ప్రధాన వీధుల్లో సాంప్రదాయబద్ధంగా ఊరేగించారు. గ్రామ మహిళలు పసుపు నీళ్లు చల్లి స్వాగతం పలికారు. పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, యువత పాల్గొన్నారు.

Comments

G
Loading comments...