Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకతీయ వర్సిటీలో రెడ్‌క్రాస్‌ యూనిట్‌ ప్రారంభం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 08, 2026 3:30 PM హన్మకొండ General
కాకతీయ వర్సిటీలో రెడ్‌క్రాస్‌ యూనిట్‌ ప్రారంభం - Udayam
కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ యూనిట్‌ కార్యాలయాన్ని రిజిస్ట్రార్‌ ఆచార్య వి.రామచంద్రం శనివారం ప్రారంభించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ ఆచార్య ఈసం నారాయణను నోడల్‌ అధికారిగా నియమించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, ఉద్యోగులతో తొలిదశలో 1,000 మంది సభ్యత్వం లక్ష్యంగా పెట్టుకున్నారు. అత్యవసర వేళ రక్తం అందించేందుకు అరుదైన రక్తగ్రూపుల డేటాబేస్‌ రూపొందించాలని సూచించారు.

Comments

G
Loading comments...