వార్తలకు తిరిగి వెళ్లండి

కదిరి టౌన్ పోలీస్ స్టేషన్‌లోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఎస్పీ సతీష్ కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. ఫిర్యాదుదారులకు అందుతున్న సేవలు, కేసుల పరిష్కార ప్రక్రియపై సమీక్షించారు.
కుటుంబ వివాదాలను సానుభూతితో, నిష్పాక్షికంగా పరిష్కరించి, ఫిర్యాదుదారులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రజల్లో పోలీసు శాఖపై విశ్వాసం పెరిగేలా సేవలు అందించాలన్నారు.
Comments
Loading comments...

