Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో బైక్ స్టంట్స్‌పై పోలీసుల చర్యలు

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 11, 2026 2:41 PM కడపGeneral
కడపలో బైక్ స్టంట్స్‌పై పోలీసుల చర్యలు - Udayam
కడప నగరంలో ప్రమాదకర బైక్ స్టంట్స్‌కు పాల్పడుతున్న యువకులపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. సోషల్ మీడియా వీడియోలు, ఫొటోల ఆధారంగా సుమారు 50 మందిని గుర్తించి, ఇప్పటివరకు 40 బైక్‌లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. గుర్తించిన వారిలో సుమారు 30 మంది మైనర్లు ఉన్నట్లు ఎస్పీ షెల్కే నచికేత్ తెలిపారు. ప్రజా రహదారులపై స్టంట్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...