Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాముకాటుతో రాష్ట్రస్థాయి కబడ్డీ ప్లేయర్ మృతి

Follow Udayam on Google
భరత్ తేజ Jul 23, 2026 3:10 PM వికారాబాద్General
పాముకాటుతో రాష్ట్రస్థాయి కబడ్డీ ప్లేయర్ మృతి - Udayam
తాండూరు మండలం కిష్టంపేటకు చెందిన రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడాకారుడు బండి సాగర్ (30) పాముకాటుతో మృతి చెందారు. తల్లిదండ్రులను పరామర్శించేందుకు వచ్చి నిద్రిస్తుండగా అతడిని పాము కరిచింది. కుటుంబసభ్యులు నిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించారు. సాగర్ మృతిపట్ల పలువురు క్రీడాకారులు, నేతలు సంతాపం తెలిపారు.

Comments

G
Loading comments...