కారు లైట్లలో బంగారం పట్టివేత

విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన 25 బంగారు బిస్కెట్లను హైదరాబాద్ శివార్లలో డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు కియాకారులో తరలిస్తుండగా తనిఖీలు నిర్వహించారు. కారు వెనుక లైట్లలో దాచిన 24 క్యారెట్ల బంగారాన్ని గుర్తించారు. దీని విలువ సుమారు రూ.3.83 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
ఈ కేసులో నిందితులను అరెస్టు చేసి, కారును స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...
