వార్తలకు తిరిగి వెళ్లండి

గార మండలం సతీవాడలోని టి.జి.ఐ. ఫ్యాక్టరీ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించి సెటిల్‌మెంట్ చేయాలని యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని సోమవారం డిమాండ్ చేశారు. 2018లో ఫ్యాక్టరీ మూతపడటంతో 400 మంది కార్మికులకు 8 నెలల జీతాలు బకాయిగా ఉన్నాయని తెలిపారు.
యాజమాన్యం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్మికుల సమస్య పరిష్కరించకపోతే జరిగే పరిణామాలకు యాజమాన్యం, అధికారులు బాధ్యత వహించాలని హెచ్చరించారు.
Comments
Loading comments...

