Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మిక సెస్ నిధుల అక్రమాలను అరికట్టాలి

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 16, 2026 5:21 PM ఖమ్మంGeneral
కార్మిక సెస్ నిధుల అక్రమాలను అరికట్టాలి - Udayam
భవన నిర్మాణ కార్మిక సెస్ నిధుల అక్రమాలను అరికట్టాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి సాంబశివుడు అన్నారు. ఆదివారం ఖమ్మం నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం భవన కార్మికుల శ్రమ వల్ల వచ్చిన సెస్ నిధిని అక్రమంగా ఖర్చు చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం కార్మికుల నిధుల పట్ల కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...