Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి

Follow Udayam on Google
p.g.murthy Aug 25, 2026 3:15 PM మంచిర్యాలGeneral
కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి - Udayam
ప్రభుత్వం ప్రకటించిన కానిస్టేబుల్ ఎస్సై పోస్టులకు అర్హులైన యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని జన్నారం మండల ఎస్సై ఉదయ్ కిరణ్ సూచించారు. మంగళవారం మధ్యాహ్నం జన్నారం మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో పోలీసులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు మేలు చేసేలా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేస్తుందన్నారు. దరఖాస్తు చేసుకునే వారికి పోలీస్ శాఖ పరంగా ఉచిత శిక్షణ ఇవ్వనున్నామన్నారు.

Comments

G
Loading comments...