వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం ధర్నా నిర్వహించారు.
ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేపట్టిన ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరు గ్యారెంటీల అమలు వైఫల్యాలను వివరిస్తూ భారీ ఫ్లెక్సీని ప్రదర్శించి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

