Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ సర్కార్‌పై పైలట్ రోహిత్ రెడ్డి ధ్వజం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Sep 03, 2026 1:43 PM వికారాబాద్General
కాంగ్రెస్ సర్కార్‌పై పైలట్ రోహిత్ రెడ్డి ధ్వజం - Udayam
ఎన్నికల హామీలను గాలికొదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విమర్శించారు. పెద్దేముల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ నిరసనలో ఆయన మాట్లాడారు. రైతు భరోసా, రూ. 2 లక్షల రుణమాఫీ అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సాగు సీజన్‌లో యూరియా కొరత తీర్చి, పంట నష్టపోయిన రైతులకు పరిహారం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...