Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జువ్విగూడాలో కచ్చా రోడ్లు బురదమయంగా మారాయి

Follow Udayam on Google
p.g.murthy Aug 18, 2026 5:12 PM మంచిర్యాలGeneral
జువ్విగూడాలో కచ్చా రోడ్లు బురదమయంగా మారాయి - Udayam
జన్నారం మండలంలోని పోన్కల్ అనుబంధ జువ్విగూడా గ్రామంలో ఉన్న అంతర్గత రోడ్లు చిత్తడిగా మారడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం అరగంట పాటు తేలికపాటి వర్షం పడింది. దీంతో జువిగూడాలోని కచ్చా రోడ్లు పూర్తిగా బురదమయంగా మారాయని వారు వాపోయారు. ప్రతి వర్షాకాలంలో రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీసీ రోడ్లను నిర్మించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...