వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్.కోట పట్టణ పోలీసు స్టేషన్ పరిధి మూలబొడ్డవర గ్రామ శివారులో జూదం ఆడుతున్న సమాచారం మేరకు దాడులు చేపట్టగా ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నట్లు ఎస్సై నవీన్ పడాల్ తెలిపారు.
జూదం ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి నుండి రూ 2500 నగదును స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. దాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

