వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత జోసెఫ్ విజయ్ ఆదివారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ అట్టహాస వేడుకలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. 60 ఏళ్ల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ విజయ్ పగ్గాలు చేపట్టడంతో అభిమానుల కోలాహలం మిన్నంటింది. కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో ఆయన అధికారాన్ని దక్కించుకున్నారు. వేలాది మంది సమక్షంలో 'విజయ్ అనే నేను' అంటూ ఆయన చేసిన ప్రమాణం తమిళనాట సరికొత్త రాజకీయ శకానికి నాంది పలికింది.
Comments
Loading comments...

