Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జోన్-10లో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 10:17 AM అనకాపల్లి General
జోన్-10లో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష - Udayam
అనకాపల్లి జోన్-10లో స్థానిక ఎన్నికల నిర్వహణపై జోన్ కమిషనర్ చక్రవర్తి మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. మొత్తం 89 పోలింగ్ కేంద్రాల్లో 29 హైపర్ సెన్సిటివ్ కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే ప్రచార సామగ్రిని తొలగించాలని ఆదేశించారు. నిఘా కోసం ఫ్లయింగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగుతాయని, ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...