Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగాల పేరుతో మోసం

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 10:28 AM కడపGeneral
ఉద్యోగాల పేరుతో మోసం - Udayam
పులివెందులలో రైల్వే, ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కడప ఎస్పీ ఆదేశాలతో విశాఖకు చెందిన ప్రకాశ్‌రావు, తిరుపతికి చెందిన మహేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరిచి, రూ.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. డబ్బులు ఇస్తే ఉద్యోగం ఖాయమని చెప్పే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...