వార్తలకు తిరిగి వెళ్లండి

పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 27న ఎస్సీ యువత కోసం ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ తెలిపింది. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ పీడీ శ్రీదేవి సూచించారు.
హాజరయ్యే అభ్యర్థులు తమ విద్యార్హత ధృవీకరణ పత్రాలు, ఫొటోలు, ఆధార్ కార్డులతో నిర్ణీత సమయానికి రావాలని ఆమె పేర్కొన్నారు.
Comments
Loading comments...

