వార్తలకు తిరిగి వెళ్లండి

మెర్సిడెస్-బెంజ్ ఇండియా 2027 జనవరి నుంచి కార్ల ధరలను పెంచనుంది. యూరోతో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం, అంతర్జాతీయ రవాణా ఛార్జీలు పెరగడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఎండీ, సీఈఓ సంతోష్ అయ్యర్ తెలిపారు.
ధరలను ఎంత మేర పెంచాలనేది ఇంకా నిర్ణయించలేదని కంపెనీ పేర్కొంది. డిసెంబరులో ద్రవ్యోల్బణం, కరెన్సీ హెచ్చుతగ్గులను సమీక్షించిన తర్వాత పెంపు స్థాయిని ఖరారు చేయనుంది.
Comments
Loading comments...

