Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జేఎన్టీయూ విద్యార్థుల ఆందోళన

Follow Udayam on Google
మానస శర్మ Jul 21, 2026 1:00 PM మహబూబాబాద్ General
జేఎన్టీయూ విద్యార్థుల ఆందోళన - Udayam
హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మహబూబాబాద్‌లోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు తరగతులను బహిష్కరించి నిరసన తెలిపారు. తాగునీటి కొరత, అధ్వాన పారిశుద్ధ్య వసతులపై వారు మండిపడ్డారు. సుమారు 30 మంది విద్యార్థులు ఒకే బాత్రూమ్‌ను ఉపయోగించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి శాంతింపజేసే ప్రయత్నం చేశారు.

Comments

G
Loading comments...