Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారంలో కోతుల సంచారంతో భయం

Follow Udayam on Google
P. G. Murthy Oct 05, 2026 9:03 AM మంచిర్యాలGeneral
జన్నారంలో కోతుల సంచారంతో భయం - Udayam
జన్నారంలోని పలు కాలనీలో కోతుల దాడులు పెరుగుతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని రామ్ నగర్, వినాయక్ నగర్, బస్టాండ్ ఏరియా, అంగడి బజార్ ప్రాంతాలలో ఇటీవల కోతుల దాడిలో పదిమందికి పైగా గాయపడ్డారు. వారు సకాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి యాంటీ రేబిస్ టీకా తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. కోతులు, కుక్కలు కరిస్తే వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ కోరారు.

Comments

G
Loading comments...