వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ జిల్లా మరిగడి గ్రామానికి చెందిన పిన్నింటి పార్వతి (55) పాము కాటుకు గురై మృతి చెందారు. ఇంటి వద్ద పాము కాటేయడంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పార్వతి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

