Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మలమడుగులో ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 2:16 PM కడపGeneral
జమ్మలమడుగులో ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ - Udayam
జమ్మలమడుగు నియోజకవర్గంలో వరుసగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురవుతుండటంతో రైతుల్లో భయాందోళన నెలకొంది. అర్ధరాత్రి వేళ ట్రాన్స్‌ఫార్మర్లు పగలగొట్టి కాపర్‌ వైర్లు ఎత్తుకెళ్తున్నట్లు రైతులు తెలిపారు. పెద్దముడియంలో రెండు, పాలూరు, నాగరాజుపల్లి, జమ్మలమడుగులో ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీకి గురైనట్లు పేర్కొన్నారు. వరుస ఘటనల నేపథ్యంలో పోలీసులు రాత్రివేళ పెట్రోలింగ్‌ పెంచాలని రైతులు కోరారు.

Comments

G
Loading comments...