Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియో ఐపీవో వాయిదా!

Follow Udayam on Google
Vikram Singh May 25, 2026 6:08 PM జాతీయంబిజినెస్
జియో ఐపీవో వాయిదా! - Udayam
దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీవోగా నిలవాల్సిన రిలయన్స్ జియో ఐపీవో మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలోని అస్థిరత కారణంగా ముకేశ్ అంబానీ ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. దేశీయ మార్కెట్ల పతనం, పెట్టుబడుల తరలింపు వంటి ప్రతికూల పరిస్థితులు రాబడులపై ప్రభావం చూపుతాయనే ఆందోళన సంస్థలో నెలకొంది. అయినప్పటికీ, ఐపీవో అనుమతుల కోసం త్వరలోనే సెబీకి దరఖాస్తు చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు ఉన్నత వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...