వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్‌గిద్ద మండలంలోని మంజీరా పరివాహక ప్రాంతంలో జింకల సంరక్షణపై అటవీశాఖ ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. జింకలు సంచరించే ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు రంగు వెలిసి తెల్లబోర్డులుగా మారడంతో హెచ్చరికలు కనిపించడం లేదని అంటున్నారు.
మండల ప్రాంతాల్లో జింకలు రహదారులు దాటుతుండటంతో ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో గస్తీ పెంచాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

