Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కోర్టులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా జడ్జి

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 15, 2026 11:45 AM విజయనగరంGeneral
జిల్లా కోర్టులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా జడ్జి - Udayam
విజయనగరం జిల్లా కోర్టు ఆవరణలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని అందించారు. అనంతరం ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.కోర్టు ఆవరణలో మొక్కలు నాటడంతో పాటు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...