Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో బస్సు-లారీ ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన 25 మందికి వైద్యం

Follow Udayam on Google
pruthviraj Aug 17, 2026 10:23 PM జగిత్యాలGeneral
జగిత్యాలలో బస్సు-లారీ ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన 25 మందికి వైద్యం - Udayam
కొండగట్టు వద్ద సోమవారం రాత్రి ఆర్టీసీ బస్సు–లారీ ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన 25 మందిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. బాధితులు, వారి కుటుంబ సభ్యులకు భోజన సౌకర్యం కల్పించాలని సూచించారు. బాధితులందరి పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...