వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల మున్సిపాలిటీ ఎజెండాలోని పలు అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ కౌన్సిలర్ అనుమల్ల జయశ్రీ కోరారు.
డీజిల్, వాహనాల రిపేర్లు, పండుగల ఏర్పాట్ల ఖర్చులు, వాహనాల కొనుగోళ్లు, పాత బిల్లులు, జీఐఎస్ మ్యాపింగ్ అంశాల్లో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రికార్డులు, బిల్లులను పరిశీలించాలని కోరుతూ ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

