వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా రవాణా శాఖ అధికారి సందాని మహమ్మద్ ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో వాహనాల పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని 21 వాహనాలపై కేసులు నమోదు చేసి డిపోకు తరలించారు.
ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని అధికారులు సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని వాహనదారులకు సూచించారు. తనిఖీల్లో ఎంవీఐలు రామారావు, సాయి చరణ్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

