జెడ్పీ పీఠంతో టీడీపీలో కలకలం

విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి వ్యవహారం టీడీపీలో అసంతృప్తికి దారితీసింది. రెండు నెలల క్రితమే పార్టీలో చేరిన మాజీ జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరిసహస్రకు ఈ పదవి దక్కడంతో సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
చాలాకాలంగా పార్టీలో ఉన్న నాయకుల ఆశలు నెరవేరకపోవడం, పలువురు కూటమి ఎమ్మెల్యేలు ఎన్నికకు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...
