Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్జీల పరిష్కారానికి జేసీ ఆదేశం

Follow Udayam on Google
రవళి దేవి Aug 03, 2026 6:52 PM బాపట్లGeneral
అర్జీల పరిష్కారానికి జేసీ ఆదేశం - Udayam
నిర్ణీత గడువులోగా అర్జీలను పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ భావన అధికారులను ఆదేశించారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి నిర్ణీత గడువులోగా పరిష్కరించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...