వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల క్రిటికల్ కేర్ ఆసుపత్రిలో మంచాల కృష్ణ ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ వాణి శ్రీనివాస్ ప్రారంభించారు. మంచాల రామేశం స్మారకార్థం చేపట్టిన ఈ సేవలను వారు అభినందించారు.
ఈ ప్లాంట్ రోగులకు, వారి సహాయకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమాజ సేవలో మంచాల కృష్ణ ఎప్పుడూ ముందుంటారని వారు కొనియాడారు.
Comments
Loading comments...

