Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీచర్ల సస్పెన్షన్‌పై జగన్‌ విమర్శలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 10:57 AM అమరావతిGeneral
టీచర్ల సస్పెన్షన్‌పై జగన్‌ విమర్శలు - Udayam
ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల పట్ల కూటమి ప్రభుత్వం కక్షగట్టిందని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ఐదుగురు టీచర్లను సస్పెండ్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. టెట్‌ నిబంధన నుంచి సీనియర్‌ టీచర్లకు మినహాయింపు కోరుతూ కేంద్రానికి వినతిపత్రం ఇవ్వడమే నేరమా అని జగన్‌ ప్రశ్నించారు. సస్పెన్షన్లు ఎత్తివేసి టీచర్లకు క్షమాపణ చెప్పాలని, ఉద్యోగుల పీఆర్‌సీ, ఐఆర్‌, డీఏల పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...