వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం దుద్దనపల్లిలో కుటుంబ కలహాలు తీవ్ర విషాదం నింపాయి.
అర్ధరాత్రి జరిగిన గొడవలో ఆగ్రహంతో భార్య ఇటుకపెల్లతో దాడి చేయడంతో కప్ప రమేష్ (43) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి కూతురు, కొడుకు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

