Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.10 వేల కోట్ల రియల్‌ ఎస్టేట్‌పై ఐటీ నజర్‌

Follow Udayam on Google
Sai Keerthan Aug 20, 2026 4:29 PM జాతీయంవాణిజ్యం
రూ.10 వేల కోట్ల రియల్‌ ఎస్టేట్‌పై ఐటీ నజర్‌ - Udayam
ఐదు సరిహద్దు రాష్ట్రాల్లో రూ.10 వేల కోట్లకుపైగా రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీల్లో పన్ను నిబంధనల లోపాలను ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. మొత్తం 14,743 లావాదేవీల్లో అవకతవకలు ఉండగా, 2,552 లావాదేవీలు నివేదించలేదని తేలింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా రూ.4,081 కోట్ల లావాదేవీలు పరిశీలనలో ఉన్నాయి. నగదు లావాదేవీలపైనా శాఖ దృష్టి సారించింది. సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు పెంచేందుకు సిద్ధమవుతోంది.

Comments

G
Loading comments...