వార్తలకు తిరిగి వెళ్లండి

బీమా రంగంలో పారదర్శకత, నమ్మకాన్ని పెంచేందుకు ఐఆర్‌డీఏఐ కీలక సవరణలు చేసింది. బీమా కంపెనీల ముఖ్య నిర్వహణ అధికారుల పనితీరును అంచనా వేసేందుకు కొత్త ప్రామాణికాలను తెచ్చింది. ఇకపై క్లెయిముల వేగవంత పరిష్కారం, ఫిర్యాదుల నివారణ, స్పష్టమైన సమాచార వెల్లడిపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేసింది.
వినియోగదారుల వ్యక్తిగత వివరాలు అడగకుండానే పాలసీల ఫీచర్లు, ధరల వివరాలను వెబ్‌సైట్లలో ఉంచడం తప్పనిసరి చేసింది. గ్రామీణ బీమాను ప్రోత్సహిస్తూ నిర్వహణ వ్యయాన్ని తగ్గించాలని ఐఆర్‌డీఏఐ నిర్ణయించింది.
Comments
Loading comments...

