వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల వద్ద జరిగిన కారు ప్రమాదంలో మృతిచెందిన నలుగురు విద్యార్థుల మృతదేహాలకు తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు తణుకు రూరల్ సీఐ డి. వెంకటేశ్వరరావు తెలిపారు.
మృతుల్లో పోతుల లక్ష్మీభాను వికాస్, నాగిరెడ్డి దుశ్యంత్‌సాయి, నాగబత్తుల సాయి సూర్యతేజ, వీరమల్లు సాయి వెంకటకిరణ్ ఉన్నారు. గల్లంతైన చరణ్ కోసం గాలింపు కొనసాగుతోంది.
Comments
Loading comments...

