Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు వాహనం ర్యాపిడోకు వినియోగంపై విచారణ

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 05, 2026 10:38 AM వరంగల్General
పోలీసు వాహనం ర్యాపిడోకు వినియోగంపై విచారణ - Udayam
వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌కు చెందిన ద్విచక్ర వాహనం ర్యాపిడో సేవలకు వినియోగిస్తున్నట్లు వీడియో వైరల్‌ కావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. అంబేడ్కర్‌ జంక్షన్‌ నుంచి సుబేదారి వరకు ప్రయాణికుడిని తీసుకెళ్లినట్లు వీడియోలో కనిపించింది. ఎనుమాముల పోలీస్‌స్టేషన్‌కు కేటాయించిన వాహనమేనని సమాచారం. ఎస్సై కుమారుడు దీనిని వినియోగించినట్లు తెలుస్తుండగా, ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీపీ ఆదేశించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...