వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో సాయికృష్ణ మృతిపై ఆర్డీవో వెన్నెల శ్రీను ఆధ్వర్యంలో మెజిస్టీరియల్ విచారణ ప్రారంభమైంది. తన కుమారుడి కాళ్లలో మేకులు కొట్టి, సీఐ నాగరాజు ఆధ్వర్యంలో స్టేషన్‌లోనే చిత్రహింసలు పెట్టి చంపేశారని బాధితుడి తల్లి విజయలక్ష్మి విచారణలో సంచలన వాంగ్మూలం ఇచ్చారు.
పోలీసులు కొట్టడం వల్లే సాయికృష్ణ మరణించాడని, మృతదేహాన్ని కూడా మాయం చేశారని ఆమె ఆరోపించారు. హింసించినట్లు తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని, ఆర్ఎంపీ వైద్యుడికి ఈ విషయం తెలుసని పేర్కొన్నారు.
Comments
Loading comments...

