Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

వైష్ణవి శర్మ Jul 20, 2026 9:23 PM ఆదిలాబాద్about 13 hours ago
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ - Udayam Digital
వరుస చోరీలకు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను మావల పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన ఈ నిందితుల నుంచి 36 గ్రాముల బంగారం, 25.50 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపిన వివరాల ప్రకారం.. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో ఈ ముఠాను పట్టుకున్నారు. నిందితులపై మహారాష్ట్రలో పలు కేసులున్నాయి.

Comments

G
Loading comments...