Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దూబచర్లలో రామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

Follow Udayam on Google
Anuroop Aug 28, 2026 7:17 PM తూర్పుగోదావరి General
దూబచర్లలో రామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ - Udayam
దూబచర్లలోని శ్రీ సంఘమిత్ర విద్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం అమృత విద్యా గణపతి సహిత రామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మీ సమేత చిన్న వెంకన్నబాబు స్వామి పీఠాధిపతి శ్రీమాన్ చిన్న వెంకన్నబాబు స్వామి చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో అంబటి శ్రీనివాసరావుతో పాటు పలువురు భక్తులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...