వార్తలకు తిరిగి వెళ్లండి

భూగర్భ జలాల పెంపునకు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించాలని, ఈ ప్రక్రియలో నవాబుపేట నంబర్‌వన్‌గా నిలవాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో 'పల్లె పల్లెకు పొన్నం అన్న' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రైతులు అధిక ఆదాయాన్నిచ్చే ఆయిల్‌ఫామ్ సాగుపై దృష్టి పెట్టాలని కోరారు.
Comments
Loading comments...

