Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రవెల్లిలో నంగారా మోగిస్తూ భజనలు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 9:42 AM ఆదిలాబాద్General
ఇంద్రవెల్లిలో నంగారా మోగిస్తూ భజనలు - Udayam
ఇంద్రవెల్లి మండలం ఆందునాయక్‌ తండాలో మథురా సమాజ్‌ ప్రజలు గురువారం రాత్రి వరకు నంగారా మోగిస్తూ భజన కీర్తనలు నిర్వహించారు. పొలాల అమావాస్య పండుగ ముగియడంతో శ్రావణమాసం ముగిసిందంటూ సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా గడిపారు. అనంతరం జ్వాలాముఖి పీఠాధిపతి, ఆధ్యాత్మిక గురువు రామ్‌సింగ్‌ మహారాజ్‌ ఆధ్యాత్మిక మార్గదర్శనం చేశారు. కార్యక్రమంలో ప్రజలు భారీగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...