వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా అంజి చౌరస్తా వరకు ర్యాలీ సాగింది.
అనంతరం ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద విద్యార్థులు, నాయకులు సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. మాజీ జడ్పీటీసీ పుష్పలత, మాజీ పీఏసీఎస్ ఛైర్మన్ దిలీప్, భాజపా మండల అధ్యక్షుడు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

